Saturday, November 23, 2024

ముంబై : లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఒడిదొడుకుల మధ్య సూచీలు కొనసాగగా.. చివరి సెషల్‌లో పుంజుకోవడంతో లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 214.17 పాయింట్ల లాభంతో.. 58,350.53 వద్ద ముగియగా, నిఫ్టీ 42.70శాతం పెరిగి 17,388.20 వద్ద ముగిసింది. ఈరోజు 1,337 షేర్లు లాభాల్లో కొనసాగగా.. 1934 షేర్లు క్షీణించించగా.. 133 షేర్లు మారలేదు. నిఫ్టీలో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, కోల్ ఇండియా నష్టాల్లో ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement