Friday, November 22, 2024

Follow up | నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. ఐదు సెషన్ల లాభాలకు బ్రేక్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నాడు నష్టాల్లో ముగిశాయి. అంతకు ముందు వరసగా ఐదు సెషన్ల లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాయంగా ప్రతికూల పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. రిలయన్స్‌, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి ప్రధాన సంస్థల షేర్లు నష్టపోవడం మార్కెట్‌ సెంట్‌మెంట్‌ను దెబ్బతీసింది. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా ఉండే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం కూడా భారీగా అమ్మకాలు జరిపారు. దీంతో సూచీలు కోలుకోలేదు.

సెన్సెక్స్‌ 334.98 పాయింట్ల నష్టంతో 60506.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 89.45 పాయింట్ల నష్టంతో 17764.60 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 460 రూపాయలు పెరిగి 57045 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 23 రూపాయలు పెరిగి 67599 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.91 రూపాయలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు..

ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, సిప్లా, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, అపోలో ఆస్పటల్స్‌, హీరో మోటో కార్ఫ్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

టాటా స్టీల్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా మోటార్స్‌, విప్రో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, టైటాన్‌ కంపెనీ, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement