దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచే మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌య్యాయి. రూపాయి బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, కీలక షేర్లలో అధిక కొనుగోళ్లు వంటివి మార్కెట్‌లో సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. సెన్సెక్స్ 712.46 పాయింట్ల లాభంతో 57570.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 228.65 పాయింట్లు లాభపడి 17158.25 వద్ద ముగిసింది.బంగారం 10 గ్రాముల ధర 47 రూపాయలు తగ్గి 51257 వద్ద ట్రేడ్‌య్యింది.
వెండి కిలో 81 రూపాయిలు పెరిగి 57700 వద్ద ట్రేడ్‌య్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.77 రూపాయిలుగా ఉంది. లాభపడిన షేర్లు టాటా స్టీల్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్, ఇన్ఫోసిస్, రియలన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. నష్టపోయిన షేర్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, దీవిస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లు న ష్టపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.