స్టాక్ మార్కెట్‌లో వరసగా రెండు రోజుల నష్టాలకు బుధవారం నాడు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల అంశాలు దేశీయ మార్కెట్లలో ఉత్సహాన్ని నింపాయి. దీంతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా లాభాల్లోకి వచ్చాయి. చాలా కార్పోరేట్ సంస్థలు, బ్యాంక్‌ల ఆర్థిక ఫలితాలు సానుకూలంగా ఉండటం వల్ల మార్కెట్లలో ఆ మేరకు మద్దతు లభించింది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న భయంతో మార్కెట్లు తొలుత కొంత ఊగిసలాట ధోరణిలో కనిపించాయి. కీలక కౌంటర్లలో కొనుగోళ్ల మద్ధతు లభించడంతో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 547.83 పాయింట్లు లాభపడి, 55816.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 157.95 పాయింట్ల లాభపడి 16641.80 వద్ద ముగిసింది. బంగారం పది గ్రాములు మూడు రూపాయిలు పెరిగి 50578 వద్ద ముగిసింది. వెండి కిలో 48 రూపాయలు పెరిగి 54763 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.68 రూపాయిలుగా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.