గ్లోబల్ మార్కెట్ల సానుకూలంగా ఉండటం, నిత్యావసరాల ధరలు తగ్గుతుండటం , ఐటి షేర్లు రాణించడం వంటి కారణాలతో బుధవారం నాడు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై పై విండ్‌పాల్ పన్ను తగ్గింపు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయాలతో ఐరోపా దేశాలకు రష్యా పూర్తి స్థాయిలో గ్యాస్ సరఫరా పునరుద్ధరించే అవకాశం ఉందన్న వార్తలు కూడా మార్కెట్‌లో ఉత్తేజాన్ని నింపాయి.
సెన్సెక్స్ ఒక దశలో 700 పాయిం ట్లకు పైగా లాభపడింది. చివరకు సెన్సెక్స్ 629.91 పాయింట్లు లాభంతో 55397.53 వద్ద ముగిసింది. నిఫ్టీ 180.30 పాయింట్ల లాభంతో 16520.85 వద్ద ముగిసింది. బంగారం పది గ్రాముల ధర 59 రూపాయిలు పెరిగి 50,379 వద్ద ముగిసింది. వెండి కిలో 103 రూపాయిలు పెరిగి 55830 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి విలువ 79.82 రూపాయలుగా ఉంది. ఒక దశలో డాలర్‌తో విలువ 80 రూపాయిలకు దిగజారింది.
లాభపడిన షేర్లు
టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, విప్రో, ఓఎన్‌జీసీ, ఆపోలో, సిప్లా షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, కోటక్
మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఆదానీ పోర్ట్స్, ఏషియన్ పేయింట్స్ షేర్లు నష్టపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.