ముంబాయి: స్టాక్ మార్కెట్లు వరసగా ఐదో రోజు లాభాల్లో ముగిశాయి. గురు వారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు కొద్ది సేపటి తరువాత కోలుకుని లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పలు ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగియడం గమనార్హం. ముడి చమురు ధరలు వంద డాలర్లకు దిగువకు రావడం, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల విషయంలో వెనక్కి తగ్గే సూచనలు ఉన్నాయన్న వార్తల రావడంతో పాటు, చమురు ఎగుమతులపై ప్రభుత్వం పన్ను తగ్గించడం వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.
సెన్సెక్స్ 284.42 పాయింట్లు లాభపడి 55681.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 84.40 పాయింట్లు లాభపడి 16605.25 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 36 రూపాయలు తగ్గి 50189 వద్ద ట్రేడయ్యింది. వెండి 655 రూపాయిలు తగ్గి 54964 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.82 రూపాయిలుగా ఉంది. డాలర్‌తో రూపాయి విలువ ఒక దశలో 80.06 కు పడిపోయింది. చమురు ధరలు తగ్గడంతో 20 పైసలు కోలుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడంతో రూపాయి మెరుగైందుకు కొంతమేర తోడ్పడింది.
లాభపడిన షేర్లు
ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఇండాల్కో, టాటా కన్జ్యూమర్ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, కోటక్ మహీంద్రా బ్యాంక్,ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, టెక్ మహీంద్రా,రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల నష్టపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.