దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నాడు లాభాల్లో ముగిశాయి. దీంతో మూడు రోజుల వరస నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. చివరి వరకు సూచీలు లాభాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 94 డాలర్లకు తగ్గడం మార్కెట్ల ఉత్సాహానికి దోహదపడింది. మూడు రోజుల పాటు భారీ నష్టాల్లో ముగియడంతో కీలక స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరిపారు. దీంతో పాటు బ్యాంకింగ్ రంగ షేర్లు రాణించడం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. సెన్సెక్స్ 478.59 పాయింట్లు లాభపడి 57625.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.05 పాయింట్లు లాభపడి 17123.60 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 146 రూపాయలు తగ్గి 50950 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 862 రూపాయలు తగ్గి 57673 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.45 రూపాయలుగా ఉంది.
లాభపడిన షేర్లు
యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్‌టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఆల్ట్రా సిమెంట్స్, ఎం అండ్ ఎం, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, ఐటీసీ, టీసీఎస్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ , ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ, టాటా స్టీల్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు
ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజ్ షేర్లు నష్టపోయాయి.