Wednesday, November 20, 2024

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు ఉదయం నష్టాలతో ప్రారంభమై, ఒడుదొడుకుల మధ్య రోజంతా సాగాయి. చివరకు లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వ, ప్రయివేట్‌ బ్యాంక్‌లు, ఆర్థిక సేవల రంగాల్లోని కొనుగోళ్ల సూచీలు అండగా నిలవడంతో నష్టాల్లో ఉన్న మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 246.47 పాయింట్లు లాభంతో 54767.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 62.05 పాయింట్ల లాభంతో 16340.55 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాములు ధర 64 రూపాయలు తగ్గి 50297 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 339 రూపాయలు తగ్గి 55752 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి విలువ 79.56 రూపాయిలుగా ఉంది. ఒక దశలో డాలర్‌తో రూపాయి విలువ 80 రూపాయిలకు పైగా దిగజారింది.

లాభపడిన షేర్లు..

యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, ఆపోలో ఆసప్పటల్స్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

హెచ్‌సీఎల్‌, నెస్లీ, సన్‌ ఫార్మా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ , ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు నష్టపోయాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement