Thursday, November 21, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నాడు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను మరికొంత కాలం ఇలానే కొనసాగించే అవకాశం ఉందన్న వార్తలతో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు, మన దేశ మార్కెట్లపై కూడా పడింది. మరో వైపు క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల కూడా ప్రభావం చూపింది. బుధవారం నాడు ఆర్బీఐ వడ్డీ రేట్లపై ప్రకటన చేయనుంది. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడ్డారు. ప్రధానంగా మెటల్‌, ఐటీ షేర్లలో

అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మార్కెట్లు రోజంతా ఉగిసలాడుతూ చివరకు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 208.24 పాయింట్ల నష్టంతో 62626.36 వద్ద ముగిసింది. నిఫ్టీ 58.30 పాయింట్ల నష్టంతో 18642.75 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 330 రూపాయలు పెరిగి 53835 వద్ద ట్రేడయ్యింది. సిల్వర్‌ కేజీ ధర 527 రూపాయలు పెరిగి 65713 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.38 రూపాయలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు

హిందూస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే ఇండియా, పవర్‌ గ్రిడ్‌కార్పొరేషన్‌, ఆల్ట్రా సిమెంట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎంఅండ్‌ ఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌ కంపెనీ, అపోలో ఆస్పటల్స్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, మారుతి సుజుకీ, విప్రో, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హీరోమోటో కార్ప్‌, బీపీసీఎల్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement