Friday, November 22, 2024

భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై – స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 850 పాయింట్లను కోల్పోయింది. చివ‌ర‌కు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 773 పాయింట్లు నష్టపోయి 60,205, నిఫ్టీ 226 పాయింట్లు కోల్పోయి 17,891 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.30%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.26%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.78%), యాక్సిస్ బ్యాంక్ (-2.02%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.02%). లు న‌ష్ట‌పోగా, హిందుస్థాన్ యూనిలీవర్ (1.14%), మారుతి (0.96%), టాటీ స్టీల్ (0.54%), ఎన్టీపీసీ (0.39%), ఐటీసీ (0.21%). స్వ‌ల్పంగా లాభ‌ప‌డ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement