ముంబై – వడ్డీరేట్ల పెంపుతో అభివృద్ధిపై భయాలు వరుసగా ఆరో రోజు దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు మూటకట్టుకున్నాయి.. నేడు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 141.87 పాయింట్లు (0.24 శాతం) నష్టంతో 59,463.93 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 45 పాయింట్ల (0.26 శాతం) పతనంతో 17,466 పాయింట్ల వద్ద ముగిసింది.ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ మధ్యాహ్నానికి అమ్మకాల ఒత్తిడి పెరగడంతో స్టాక్స్ నష్టాలను చవి చూశాయి. హిండాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్ స్క్రిప్ట్‌లు భారీ నష్టాలు చవి చూశాయి.. మరోవైపు రిలయన్స్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, ఓఎన్జీసీ, దివిస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ స్టాక్స్ లాభాలు గడించాయి..
Advertisement
తాజా వార్తలు
Advertisement