Monday, November 25, 2024

అయిదో రోజూ స్టార్ మార్కెట్ బేర్…17వేల దిగువ‌కు సెన్సెక్స్

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ ఉదయం లాభాల్లో ప్రారంభమైనా మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల అనంతరం నష్టాల్లో ముగిశాయి. నేడు ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, టెలికాం స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా ఐదోరోజూ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్‌ 344 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 17వేల దిగువన ముగిసింది . ఉదయం 58,268 పాయింట్ల వద్ద 300కు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 58,473 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. అమ్మకాల ఒత్తిడితో మధ్యాహ్నం తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. చివరికి 344.29 పాయింట్లు కోల్పోయి 57,555.90 వద్ద సెన్సెక్స్‌ ముగిసింది. నిఫ్టీ 71.10 పాయింట్ల నష్టంతో 16,972 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, టైటాన్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌ గ్రిడ్‌, కోటక్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, ఎన్టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్ లు కొద్దిపాటి లాభాల‌తో గ‌ట్టెక్కాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ ఇండ్‌, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే నష్టాలు మూటగట్టుకున్నాయి. మెటల్‌, ఫార్మా, క్యాపిటల్‌ గూడ్స్‌ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement