ముంబై – ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై బాగానే పడింది.. బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే స్టాక్ మార్కెట్ సూచిలు వేగంగా పెరిగిపోయాయి.. ఒకనొక దశలో సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లతో లాభ పడి ముదుపరులలో చిరునవ్వు నింపింది.
బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే డౌన్ ట్రెండ్ ప్రారంభమైంది.. ఫలితంగా.. వరుసగా మూడో రోజు.. సెన్సెక్స్, నిఫ్టీ.. బెంచ్ మార్క్‌లకు దిగువనే ముగిశాయి. బడ్జెట్ ఆశాజనకంగా ఉందంటూ సానుకూల అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు ఆశ్చర్యకరంగా ఇంత స్వల్ప మార్జిన్లతో ఎండ్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 158 పాయింట్లు పెరిగి 59 వేల 708 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
నిఫ్టీ 45 పాయింట్లు తగ్గి 17 వేల 616 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం వరకు నష్టపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే.. నిఫ్టీలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల సూచీ 9 శాతం పతనమైంది. మెటల్ ఇండెక్స్ 5 పాయింట్ 6 శాతం దిగజారింది.