ముంబై – దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ప్రారంభం నుంచి స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ పతనం ప్రభావం ఓవరాల్ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. అదానీ గ్రూప్ సంస్థలకు భారీగా రుణాలిచ్చాయన్న హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా నష్టపోయాయి. అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.2 లక్షల కోట్లు హరించకుపోయింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 874 పాయింట్లు నష్టపోయి 59,331 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 59,307 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 288 పాయింట్ల నష్టంతో 17,604 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలో అదానీ గ్రూప్‌లోని అదానీ ఎంటర్‌ప్రైజెస్ 18 శాతం, అదానీ పోర్ట్స్ 15 శాతం నష్టాలను చవి చూశాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఐదు శాతం వరకు పతనం అయ్యాయి. అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్స్ షేర్లు 5-20 శాతం మధ్య నష్టపోయాయి. టాటా మోటార్స్ (ఆరు శాతం), బజాజ్ ఆటో (5.8 శాతం), డాక్టర్ రెడ్డీస్ (మూడు శాతం వరకు) నేడు లాభ పడ్డాయి..
అదాని దెబ్బకు స్టాక్ మార్కెట్ కుదేలు..
Advertisement
తాజా వార్తలు
Advertisement