Friday, November 22, 2024

Stock Market – స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కె్ట్ వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసింది. ఉదయం సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అయినా.. అరంతరం వేగంగా పుంజుకుంది. ఇక నిఫ్టీ అయితే మరోసారి ఆల్‌టైమ్ రికార్డ్ సొంతం చేసుకుంది. శుక్రవారం 23, 490 తాజా మార్కు చేరింది. సెన్సెక్స్ 181 పాయింట్లు లాభపడి 76, 992 దగ్గర ముగియగా.. నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 23, 465 దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 23, 500 మార్కు రీచ్ అయ్యేందుకు అతి చేరువలో ఉంది. ఇక ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

 ఐటీ మినహా దాదాపు అన్నిరంగాల షేర్లు రాణించాయి. ఆటో, టెలికాం, రియల్టీ, లోహ, హెల్త్‌కేర్‌ సూచీలు 0.5-1 శాతం మేర పెరిగాయి. నిఫ్టీలో ఐషర్‌ మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు లాభపడగా.. టీసీఎస్‌ టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, నెస్లే షేర్లు నష్టపోయాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement