Tuesday, November 26, 2024

Stock Market – నష్టాలలో స్టాక్ మార్కెట్ ….

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో వరుస లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. దేశీయంగా కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమయ్యాయి. అయితే.. ఆ జోరు ఎంతోసేపు నిలవలేదు. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ఆరంభ లాభాలు ఆవిరై ఈ వారాంతాన్ని మార్కెట్లు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్‌ 270 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ 23,550 మార్క్‌ కిందకు పడిపోయింది.

ఈ ఉదయం 77,729 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఆరంభంలో 77,800 మార్క్‌ను దాటి ట్రేడ్‌ అయ్యింది. మధ్యాహ్నం తర్వాత దిగ్గజ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 76,802 పాయింట్ల ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరకు 269.03 పాయింట్లు కోల్పోయి 77,209.90 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 23,398-23,667 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 65.90 పాయింట్లు దిగజారి 23,501.10 వద్ద స్థిరపడింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement