Wednesday, January 8, 2025

Stock Market – మ‌దుప‌ర్ల‌ను ముంచేసిన వైర‌స్ – ఒక్క రోజులో 12 లక్ష‌ల కోట్ల న‌ష్టం…

ముంబై – దేశంలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూసిన వేళ సూచీలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు సూచీలను పడేశాయి. ఉదయం సెన్సెక్స్ 79,281.65 (క్రితం ముగింపు 79,223,11) పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమైంది. ఉదయం కాసేపు లాభనష్టాల మధ్య చలించింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారుల్లో హెచ్ఎంపీవీని గుర్తించినట్లు వార్తలు రావడంతో సూచీలు పతనం ప్రారంభమైంది. అనంతరం భారీ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 77,781.62 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1258.12 పాయింట్ల నష్టంతో 77,964.99 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 388.70 పాయింట్లు నష్టపోయి 23,616.05 వద్ద స్థిరపడింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ. 12 లక్షల కోట్ల మేర క్షీణించి రూ. 439 లక్షల కోట్లకు చేరింది.

డాలరుతో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు క్షీణించి 85.82గా ఉంది. టైటాన్, సన్ఫార్మా షేర్లు మినహా మిగిలిన అన్ని కంపెనీల షేర్లూ నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement