Monday, June 24, 2024

Stock Market – లాభాల‌లో ముగిసిన స్టాక్ మార్కెట్ …..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 77,367 పాయింట్లు, నిఫ్టీ 23,579 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తూ సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 77,235.31 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల జోరు కొనసాగింది. ఇంట్రాడేలో 77,071.44- 77,366.77 మధ్య కదలాడింది. చివరికి 308.37 పాయింట్ల లాభంతో 77,301.14 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 92.30 పాయింట్ల లాభంతో 23, 557.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.42గా ఉంది. సెన్సెక్స్‌లో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, విప్రో, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రధానంగా లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్, టాటా మోటార్స్‌, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement