Friday, November 22, 2024

TG | నేషనల్ హైవే-44కి మహర్ధశ…

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్, బాలానగర్, నవాబుపేట, మిడ్జిల్ మండలాల్లో రూ.118 కోట్ల నిధులతో డబుల్ లేన్ బిటి రోడ్డు పనులకు సోమవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ… నేషనల్‌ హైవే-44ను 12 లేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైవే 44 విస్తరణకు చర్యలు చేపడుతున్నామని, ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ రహదారుల సంస్థ అధికారులతో సమీక్షించారని వెల్లడించారు. తుక్కుగూడ నుంచి శ్రీశైలం రహదారి విస్తరణకు చర్యలు చేపట్టామన్నారు.

నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో డబుల్ లేన్ రోడ్లు, బైపాస్ రోడ్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. జడ్చర్ల నుంచి భూత్పూర్ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడించారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement