హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : నకిలీ విత్తనాలకు చరమగీతం పాడేందుకు వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చెలరేగిపోతున్న నకిలీ విత్తన తయారీ సంస్థలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా కొన్ని సంస్థలు యదేచ్చగా ఈ వ్యాపారాన్ని సాగిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్న ఆరోపణలు వినవస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ఈ వానాకాలం నుంచి ప్రతి విత్తన ప్యాకెట్‌పై బార్ కోడ్ విధానం అమలు చేయాలని ఈ కోడ్‌ను ముద్రించని విత్తనాలను మార్కెట్‌లో లేకుండా చేయాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. విత్తనాలను తయారు చేసే బహుళ జాతి సంస్థలతో పాటు ఇతర కంపెనీలకు కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కేంద్రం ఒక అడుగు ముందుకేసి బార్ కోడ్ విధానాన్ని అమలు చేయకపోతే కంపెనీల లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు ఆ కంపెనీలను బ్లాక్ లిస్టులు పెడతామని హెచ్చరించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.