న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశరాజధానిలో తయారైన విగ్రహాలు రాష్ట్ర రాజధానిలో కొలువుదీరనున్నాయి. హస్తినలో రూపుదిద్దుకున్న కళాఖండాలు భాగ్యనగరానికి తరలివెళ్లబోతున్నాయి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా మహనీయులు, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్న సందర్భంగా తెలంగాణా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఢిల్లీ పర్యటన చేపట్టారు.
మంగళవారం ఆయన ఢిల్లీలోని పలు విగ్రహాల తయారీ స్టూడియోలను సందర్శించారు. ఆయా స్టూడియోల్లో ప్రాణం పోసుకుంటున్న విగ్రహాలను క్షుణ్నంగా పరిశీలించారు. వివిధ విగ్రహాల తయారీకి వాడుతున్న వస్తువులు, పరికరాలు, కళాకారుల అనుభవం, నైపుణ్యం, పూర్తయ్యేందుకు పట్టే సమయం, శిల్పాలను రూపుదిద్దడానికి వాడుతున్న టెక్నాలజీ, ఇతర ప్రాంతాలకు తరలించడం ఎలా అనే విషయాల గురించి మంత్రి నిపుణులను అడిగి తెలుసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..