Saturday, November 23, 2024

త్వరలో 18-45 ఏళ్ల వారికీ టీకా

మే 1 నుంచి రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవారికి కూడా టీకా వేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్. జీ. శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రభతో మాట్లాడిన ఆయన ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలను పంపామని చెప్పారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా
వేసేందుకు కేంద్రం అనుమతించే అవకాశాలు ఎక్కువ
గా ఉన్నాయని, మరోవైపు నిత్యం ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండి కరోనా ముప్పు పొంచి ఉన్న ట్రాన్స్పోర్టు,ఇతర వాణిజ్య విభాగాల ఉద్యోగులందరికీ టీకా ఇచ్చే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించామని చెప్పారు.

ప్రతీ రోజూ రాష్ట్రంలో లక్ష మందికి కరోనా వ్యాక్సినేషన్ వేసేందుకు కార్యాచరణ సిద్ధమైందన్నారు. ఈ విషయమై సీఎస్ సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతున్నారని చెప్పారు. వివిధ రకాల విభాగాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయం, సహకారంతో అర్హులైన వారందరినీ దగ్గర్లోని కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రానికి తీసుకెళ్తామని ప్రకటించారు. ఇప్పటికే రోజుకు 62 వేలదాకా వ్యాక్సిన్ వేస్తామన్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే రోజుకు లక్ష
మందికి వ్యాక్సిన్ వేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement