పంజాబ్ సీఎం అభ్యర్థిపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థి విషయమై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. కొత్త పంజాబ్ నిర్మాణం అనేది.. ముఖ్యమంత్రి ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. ఆయన తన మద్దతుదారులతో కలిసి సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఎలా చెబితే.. అలా వినే వ్యక్తిని, బలహీనమైన అభ్యర్థిని సీఎంగా ఉండాలని భావిస్తోందన్నారు. ఈసారి మాత్రం ముఖ్యమంత్రిని ప్రజలే ఎన్నుకోవాలి అంటూ పిలుపునిచ్చారు.
పంజాబ్ సీఎం రేసులో తాజా ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీతో పాటు సిద్దూ ఉన్నాడు. ఒక వేళ కాంగ్రెస్ గెలిస్తే.. మళ్లి సీఎంగా చన్నీనే చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. అధిష్టానం వైఖరిపై సిద్దూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చన్నీ, సిద్దూలలో ఎవరిని ఉంచాలనే విషయమై.. కాంగ్రెస్ అధిష్టానం.. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నది. ఎక్కువ మంది చన్నీవైపే మొగ్గు చూపుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై తెరపడనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..