Friday, November 22, 2024

రెండేళ్ల తర్వాత ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు : సీఎస్‌ సోమేష్‌కుమార్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కోవిడ్‌ కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు సీఎస్‌ సోమేష్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 2న రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి పూర్తి డ్రెస్‌ రిహార్సల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్‌లో జరగనున్న ఈ వేడుకలకు సంబంధించి పూర్తి డ్రెస్‌ రిహార్సల్‌ పరేడ్‌ను వీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ జూన్‌ 2న పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా గన్‌పార్కు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌కు చేరుకుని పోలీస్‌ దళాల వందనం స్వీకరిస్తారు.

అనంతరం సీఎం ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి రిహార్సల్‌ను సీఎస్‌ పరిశీలించారు. కోవిడ్‌ కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, మునిసిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, పొలిటికల్‌ కార్యదర్శి శేషాద్రి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, జలమండలి ఎండీ దానకిషోర్‌, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, వివిధ అధికారులు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement