Tuesday, November 26, 2024

మహిళల కోసం స్టార్‌ ఉమెన్‌ కేర్‌ బీమా, 18-75 ఏళ్ల వారికి వర్తింపు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. స్టార్‌ ఉమెన్‌ కేర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని విడుదల చేసినట్టు భారతదేశపు మొట్టమొదటి స్టాండ్‌లోన్‌ ఆరోగ్య బీమా కంపెనీ స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కో లిమిటెడ్‌ ప్రకటించింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన ఈ సమగ్రమైన ఆరోగ్య బీమా పథకంగా తెలిపింది. మహిళల జీవితంలో ప్రతీ దశలోనూ వారి ఆరోగ్య అవసరాలను తీర్చే రీతిలో దీన్ని ప్రత్యేకించి తీర్చిదిద్దామని ప్రకటించింది. స్టార్‌ ఉమెన్‌ కేర్‌ బీమా పథకం.. వ్యక్తిగత పాలసీ, ఫ్లోటర్‌ పాలసీ రూపంలో 18 ఏళ్లు నుంచి 75 ఏళ్ల మహిళలకు లభ్యం అవుతుందని వివరించింది. స్టార్‌ హెల్త్‌ అండ్‌ ఎలైడ్‌ ఇన్సూరెన్స్‌ కో లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ రాయ్‌ మాట్లాడుతూ.. స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆధారంగా తాము మహిళలకు అత్యున్నత స్థాయి భద్రత, మద్దతును అందించాలనుకుంటున్నామన్నారు. స్టార్‌ ఉమెన్‌ కేర్‌ బీమా పాలసీ అనేది స్వతంత్య్ర, సమగ్రమైన బీమా పథకమని, ఇది మహిళలు తమ సొంత ఆరోగ్య బీమా అవసరాలను తీర్చుకునే రీతిలో ఉంటుందని తెలిపారు.

ప్రతీ దశలో ఆరోగ్య సహకారం..

ఈ పాలసీని మహిళల ప్రత్యేక అవసరాలను వారి జీవితంలో ప్రతీ దశలోనూ తీర్చుకునే రీతిలో తీర్చిదిద్దామని వివరించారు. తద్వారా పెరిగిన వైద్య ఖర్చులతో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను తగిన పరిష్కారం అందిస్తున్నామన్నారు. ఈ పాలసీ పలు ప్రత్యేక ఫీచర్లు అయినటువంటి ప్రీ-యాక్సెప్టెన్స్‌ మెడికల్‌ స్క్రీనింగ్‌, మధ్యంతర చేరికలు, గర్భధారణ సమయంలో పాలసీ కొనుగోలు చేసే అవకాశం, ప్రెగ్నెన్సీ కేర్‌ ట్రీట్‌మెంట్‌, గర్భాశయంలో పిండ శస్త్ర చికిత్సలు, నవజాత శిశువుల హాస్పిటలైజేషన్‌ ఖర్చులు, వ్యాక్సినేషన్‌, పీడియాట్రిషియన్‌/మెడికల్‌ కన్సల్టేషన్స్‌, నివారణ ఆరోగ్య పరీక్షలు కవర్‌ అవుతాయన్నారు. మగవారితో ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో పోటీపడుతున్నారని, ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వివరించారు. కోటి రూపాయలు, రూ.5 లక్షలు, రూ.10లక్షలు, రూ.15లక్షలు, రూ.20లక్షలు, రూ.25 లక్షలు, రూ.50లక్షల వరకు బీమా అందుబాటులో ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement