ఫోర్బ్స్ అత్యధిక ఆర్జన కలిగిన క్రీడాకారిణుల జాబితాలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ 12వ స్థానంలో నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టోర్నీలు, స్పాన్సర్‌షిప్ ఒప్పందాల ద్వారా ఏడాదికి సింధు 7.1 మిలియన్ డాలర్లు (సుమారు 59 కోట్లు) ఆర్జించిందని ఫోర్డ్స పేర్కొంది. ఫోర్బ్స్ విడుదల చేసిన 25 మంది క్రీడాకారిణుల జాబితాలో బ్యాడ్మింటన్ , భారత్ నుంచి సింధూ మాత్రమే ఉండటం విశేషం. ఇక.. టెన్నిస్ ప్లేయర్లు నవోమి ఒసాకా (రూ 423 కోట్లు జపాన్ ) ప్రథమ, సెరెనా విలియమ్స్ (రూ 342 కోట్లు అమెరికా) ద్వితీయ స్థానాలు సాధించారు. స్కైయింగ్ క్రీడాకారిణి ఎలీనా గు (చైనా) రూ. 167 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement