మలేషియా ఓపెన్ 2022లో భాగంగా జరుగుతున్న పోటీల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సీంధూ వెనుతిరిగింది. మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌లోనే సింధూ తబబడింది. దీంతో తైవాన్‌కు చెందిన తాయ్ ట్జు–యింగ్‌తో పోరాటంలో 21-13, 15-21, 13-21 తేడాతో మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే.. గురువారం థాయ్‌లాండ్‌కు చెందిన ఫిట్టయాపోర్న్ చైవాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం సింధూ అద్భుతమైన ప్రదర్శన చూపింది. 19-21, 21-9, 21-14 తేడాతో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
ఇక.. హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా 21-15, 21-17తో వరుస సెట్లలో వరల్డ్ నం.4 చైనీస్ తైపీ ప్లేయర్ చౌ టియెన్-చెన్‌ను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లో ఇండోనేషియాకు చెందిన జొనాటన్ క్రిస్టీ చేతిలో ప్రణయ్ కూడా ఓడిపోయాడు. కోర్టు 2లో ఆడిన ప్రణయ్ 21-18, 21-16తో మ్యాచ్‌లో ఓడిపోయాడు. దీంతో మలేషియా 2022 ఓపెన్ గేమ్స్ కు భారత్ ముగింపు పలికినట్టయ్యింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.