Friday, November 22, 2024

సీఎస్‌సీతో స్టార్‌ హెల్త్‌ ఒప్పందం.. గ్రామీణుల ఆరోగ్య భద్రతపై దృష్టి

ఆరోగ్య బీమా కంపెనీల్లో ఒకటైన స్టార్‌ హెల్త్‌ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కామన్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ (సీఎస్‌సీ)తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఐదు లక్షల మంది సీఎస్‌సీలు ఎంపిక చేసిన స్టార్‌ హెల్త్‌ ఉత్పత్తులను పొందే అవకాశం కలుగుతుంది. గ్రామీణ ప్రాంతవాసులతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వారికి స్టార్‌ హెల్త్‌ ఉత్పత్తులు ఈ ఒప్పందంతో అందుబాటులోకి వస్తాయని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ రాయ్‌ తెలిపారు.

గ్రామ పంచాయితీల్లో ఐదు లక్షల మంది సీఎస్‌సీలు ఉన్నారని, వీరు తేలిగ్గానే గ్రామీణులకు ఈ ఉత్పత్తులను అందించగరని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య బీమాపై సరైన అవగాహన లేదని ఈ భాగస్వామ్యం వల్ల ఇది సాధ్యమవుతుందన్నారు. గ్రామీణులు ఆర్ధిక భద్రత కోసం ఆరోగ్య బీమా ఉపయోగపడుతుందని సీఎస్‌సీ సీఈవో సంజయ్‌
కుమార్‌ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement