శ్రీలంక యువ ఆటగాడు.. స్టార్ క్రికెటర్ భానుక రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేశాడు. ఈ మేరకు లంక బోర్డుకు లేఖ పంపాడు. బోర్డు ప్రవేశపెట్టిన కొత్త ఫిట్‌నెస్ మార్గదర్శకాలు (ప్రతీ ఆటగాడు 8.10 నిమిషాల్లో 2 కిలోమీటర్లు పరుగెత్తాలి ఉంది. పరుగు పూర్తి చేయకపోతే.. వేతనాల్లో కోత పెట్టనున్నారు) కారణంగానే రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తోంది.
2021లో టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్3లో నిలిచాడు. 5 వన్డేలు, 18 టీ20లు మాత్రమే ఆడాడు. 30 ఏళ్ల రాజపక్స.. శ్రీలంక అండర్19 జట్టులో అద్భుతాలు సృష్టించి.. సీనియర్ జట్టులోకి వచ్చాడు. గతేడాది స్వదేశంలో ధవన్ సేనతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అరంగేట్రం చేశాడు. వన్డేల్లో ఒకటి, టీ20ల్లో రెండు అర్ధ సెంచరీలు చేశాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital