ఉద్యమకారుడు, ఆదివాసీ హక్కుల నేత స్టాన్ స్వామి (84) ఇవాళ కన్నుమూశారు. ఎల్గర్ పరిషత్ కేసులో అరెస్టు అయిన స్టాన్ స్వామి గత కొన్నాళ్ల నుంచి అస్వస్థతతో ఉన్నారు. ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స పొందుతున్నారు. సోమవారం నాడు బెయిల్ పిటిషన్ సందర్భంగా బాంబే కోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో స్టాన్ స్వామి మరణించినట్లు ఆయన తరపున లాయర్ ముంబై హైకోర్టుకు తెలిపారు. ఆదివారం నుంచి ఆయన వెంటిలేటర్‌పై శ్వాస తీసుకుంటున్నారు. బీమా కోరేగావ్‌కు 200 ఏళ్లు అయిన సందర్భంగా పుణెలో 2017, డిసెంబర్‌లో ఎల్గర్ పరిషత్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశం తర్వాత మహారాష్ట్రలో భారీ స్థాయిలో అల్లర్లు జరిగాయి. ఆ కేసులో స్టాన్ స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్ల పాటు ఆయన్ను నవీ ముంబైలోని తలోజా ప్రిజన్‌లో ఉంచారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement