Tuesday, October 29, 2024

Stampade – ముంబయి రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట

ముంబయిలోని బాంద్రా టెర్మినస్‌లో ఆదివారం తొక్కిసలాట జరిగింది. బాంద్రా (ఇ) ప్లాట్‌ఫారమ్‌ నంబర్‌ 1పై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళన కరంగా ఉన్నట్లు సమాచారం.

ఈ సంఘటన తెల్లవారుజామున 2.25 గంటల ప్రాంతంలో జరిగింది. బాంద్రా గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (రైలు నంబర్‌ 22921) ముంబై రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే, ప్రజలు అందులో ఎక్కే ప్రయత్నంలో ఈ తొక్కిసలాట జరిగింది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement