తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతోంది. సీఎం పీఠం అధిష్ఠించనున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మంత్రివర్గాన్ని రూపొందించారు. తనతో కలిపి 34 మంది మంత్రుల జాబితాను స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు పంపారు. గవర్నర్ ఈ జాబితాను లాంఛనంగా ఆమోదించారు. కాబోయే సీఎం స్టాలిన్ సిఫారసులకు గవర్నర్ రాజముద్ర వేశారు.
కాగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి కూడా మంత్రివర్గంలో స్థానం లభించనుందని గత కొన్నిరోజులుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, స్టాలిన్ గవర్నర్‌కు పంపిన జాబితాలో ఉదయనిధి పేరు లేదు. ఇక, స్టాలిన్ సాధారణ పరిపాలన సహా పలు శాఖలను తన వద్ద ఉంచుకున్నారు. స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.