వర్షపు నీటిలో ధాన్యం, ధాన్యపు బస్తాలు…
వైరా వైరా మండల పరిధిలో గ్రామాలు రోడ్డుపై తడిచిన దాన్యపు రాసులు.
కోలుకోలేని దెబ్బ…
ఖమ్మం జిల్లా వైరా కొణిజర్ల మండల పరిధిలో ఈరోజు
తెల్లవారుజామున కురిసిన వర్షానికి ధాన్యం తడిచి ముద్దయింది
రోడ్లపైన, మార్కెట్ యార్డు లోన ఎటు చూసిన దాన్యం రాశులే కుప్పలు, కుప్పలుగా ఉన్నాయి. ఒక్కసారిగా మేఘూవృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో ప్రారంభమైయ్యాయి. వాతావర ణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో దాదాపు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ఎక్కడి ధాన్యం అక్క డ తడిచి పోయింది. రోడ్లపైన, మార్కెట్లో దాన్నం నీళ్ళల్లో కొట్టుకునిపోయింది.
- ఎటు చూసినా తడిచిన ధాన్యపు రాశులు “
కుదేలైన రైతు….
ఈరోజు తెల్లవారుజామున కురిసిన వర్షానికి డీసీఎంఎస్, వ్యవ సాయ మార్కెట్లు కొనుగోలు చేసిన దాన్యం, బస్తాల్లో నింపి ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రైతుల వద్ద కొనుగోలు చేసిన దాన్యమే గాకుండా, రైతులు అమ్ను కోవటానికి రోడ్లపై ఎండబెట్టిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోయింది. డీసీఎంఎస్, పీఏసీఎస్, ఐకేపీ, మార్కెట్ లలో మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా కొనుగోలు చేసిన దాన్యం వేల క్వింటాళ్ళల్లో ఇంకా కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో సైతం వేల క్వింటాళ్ల దాన్యం అమ్మకానికి ఉంది. వర్షం పడితే రైతు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటిపాలైంది ధాన్యాన్ని సకాలంలో ఆదుకోవాలని రైతులు కోరారు….