స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూల్ కాసేపటి క్రితమే విడుదలైంది. కరోనా నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. పరీక్షలు రాసే అభ్యర్థులందరూ కరోనా నియమ నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
✪ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2019 సంబంధించి రాతపరీక్ష పూర్తయినప్పటికీ కరోనా కారణంగా స్కిల్ టెస్ట్ వాయిదా పడింది. ఇప్పుడు కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 15, 16 తేదీలలో ఈ పరీక్ష జరగనుంది.
✪ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ 2020 (పేపర్-2)ను సెప్టెంబర్ 26వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు.
✪ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020 (పేపర్ 1): అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 20వ తేదీ మధ్య ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
✪ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, ఇతో పాటు గ్రేడ్ డి ఎగ్జామినేషన్ 2019 (స్కిల్ టెస్ట్): అక్టోబర్ 21, అక్టోబర్ 22 ఈ రెండు రోజుల పాటు నిర్వహిస్తారు.
ఈ వార్త కూడా చదవండి: మళ్లీ ఇంగ్లండ్ వెళ్లనున్న టీమిండియా