దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. మహిళలు అయితే బంగారానికి పడిచచ్చిపోతారు. కాగా గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు…ఇటీవల తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు రోజులుగా మాత్రం స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 వద్ద ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, వెండి మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ.300 పెరిగి 73,400కి చేరింది.