Tuesday, November 26, 2024

నింగిలోకి దూసుకెళ్లిన SSLV-D1 రాకెట్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త చరిత్ర లిఖించింది. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన ఉపగ్రహ వాహక నౌక ఎల్‌ఎస్‌ఎల్వీ-డీ1 రాకెట్‌ను ప్రయోగించింది. శ్రీహరికోటలోని షార్‌ మొదటి లాంచ్‌పాడ్‌ నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లించింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేళ చేపట్టిన ఈ రాకెట్‌ ప్రయోగంతో ఆ‌జా‌దీ‌శాట్‌తోపాటు ఈఓఎస్‌-02 ఉపగ్రహాలను తక్కువ ఎత్తులోని సమీప భూకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇవి మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్‌ అనుసంధానికి ఉపయుక్తం కానున్నాయి.

ఎస్ఎస్ఎల్వీ అన్నది తక్కువ ఖర్చుతో చిన్న పాటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు తయారు చేసినది. ఇప్పటి వరకు అన్ని రకాల శాటిలైట్ల ప్రయోగానికి పీఎస్ఎల్వీని ఇస్రో ఉపయోగించేది. కానీ, దానికయ్యే ఖర్చు, సమయం ఎక్కువ. కానీ, ఎస్ఎస్ఎల్వీ విషయంలో మూడు రోజుల్లో కేవలం రూ.30 కోట్ల వ్యయంతోనే ఉపగ్రహాలను ప్రయోగించడం సాధ్యపడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement