Saturday, November 23, 2024

నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న‌ ఎస్‌ఎస్‌సీబీ

6వ యూత్‌ పురుషుల జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌ బోర్డు (ఎస్‌ఎస్‌సిబి) టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. హర్యానా, చండీగఢ్‌లు వరుసగా 54, 20 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. హర్యానా నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలను గెలుచుకోగా, చండీగఢ్‌ రెండు రజతం, ఒక కాంస్యంతో తమ పోరాటాన్ని ముగించాయి.

(ఎస్‌ఎస్‌సిబి) తరఫున బరిలోకి దిగిన 11 మంది బాక్సర్లలో తొమ్మిది మంది విజేతలుగా నిలిచారు. 85 పాయింట్లతో స్వర్ణ పతకంతో పాటు టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని, 13 పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకున్నారు.
చివరి రోజున ఎస్‌ఎస్‌సిబి బాక్సర్లు రిషి (48 కేజీలు), ఆర్యన్‌ (51 కేజీలు) బీహార్‌కు చెందిన రాహుల్‌, మణిపూర్‌కు చెందిన థోక్‌చోమ్‌ సింగ్‌పై వరుసగా 5-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సాధించారు.

- Advertisement -

54 కేజీల బాంటమ్‌ వెయిట్‌ ఫైనల్‌లో ఎస్‌ఎస్‌సీబీకి చెందిన ఆశిష్‌, సిక్కింకు చెందిన జయంత్‌ దాగర్‌ను చిత్తుచేశాడు. బౌట్‌ను 4-3తో గెలిచాడు. సర్వీసెస్‌లో నిఖిల్‌ (57 కేజీలు), హంతోయ్‌ (60 కేజీలు), అంకుష్‌ (67 కేజీలు), ప్రీత్‌ మాలిక్‌ (71 కేజీలు), యోగేశ్‌ (75 కేజీలు), ఐరన్‌ (86 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించారు. అర్మాన్‌ (80 కేజీలు), హర్ష్‌ (92 కేజీలు) రజత పతకాలను సాధించగా, క్రిష్‌ కాంబోజ్‌ (63.5 కేజీలు), రిథమ్‌ (92ం కేజీలు) సర్వీసెస్‌లో కాంస్య పతకాన్ని సాధించారు.

హర్యానాకు ప్రాతినిధ్యం వహించిన ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌ భరత్‌ జూన్‌ (92 కేజీలు), తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. హర్యానాకు చెందిన మిగతా ముగ్గురు స్వర్ణ విజేతలు యశ్వర్ధన్‌ సింగ్‌ (63.5 కేజీలు), ఇషాన్‌ కటారియా (80 కేజీలు), లక్షయ్‌ రాఠీ (92 కేజీలు). ఎస్‌ఎస్‌సిబికి చెందిన ఆశిష్‌ (54 కేజీలు) ఉత్తమ బాక్సర్‌గా ఎంపిక కాగా, సిక్కింకు చెందిన జయంత్‌ దాగర్‌ (54 కేజీలు) టోర్నమెంట్‌ అంతటా అద్భుత ప్రదర్శన చేసినందుకు అత్యంత ఆశాజనక బాక్సర్‌ అవార్డును అందుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement