దేశ రక్షణ దళంలో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. కానిస్టేబుల్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి 25 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరగనున్నట్లు పేర్కొంది.
రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ssc.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. కాగా, ఈ ఏడాది SSC GD ప్రకటన ద్వారా 39,481 పోస్టులు భర్తీ చేయనున్నారు.
తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. కాగా, ఏపీ, తెలంగాణలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు.
పరీక్ష విధానం:
పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలతో మొత్తం 160 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు కాగా.. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్/ హిందీ 20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్షలో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కాగా.. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (సగం మార్కు) కోత విధిస్తారు.
మొత్తం ఖాళీల సంఖ్య: 39,481
విభాగం, పోస్టుల సంఖ్య :
బీఎస్‌ఎఫ్ – మెన్-13306, ఉమెన్-2348 : 15,654
సీఐఎస్‌ఎఫ్ – మెన్-6430, ఉమెన్-715 : 7,145
సీఆర్‌పీఎఫ్ – మెన్-11299, ఉమెన్-242 : 11,541
ఎస్‌ఎస్‌బీ – మెన్-819, ఉమెన్-0 : 819
ఐటీబీపీ – మెన్-2564, ఉమెన్-453 : 3,017
ఏఆర్ – మెన్-1148, ఉమెన్-100 : 1,248
ఎస్‌ఎస్‌ఎఫ్ – మెన్-35, ఉమెన్-0 : 35
ఎన్‌సీబీ – మెన్-11, ఉమెన్-11 : 22