రాజమౌళి సినిమా రంగంతో పాటు క్రీడా రంగంలో కూడా భాద్యతలు నిర్వహించనున్నాడు. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ISBC) చైర్మన్‌గా భాద్యతలు స్వీకరించబోతున్నాడు. ప్రతిభ ఉండి కూడా అవకాశం, సదుపాయాలు లేక ఎదురు చూసే క్రికెటర్స్ ని గుర్తించి వారిలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ బోర్డ్ ఏర్పడింది. మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ మొదలైన ఈ బోర్డు గ్రామీణ స్థాయి నుంచి దేశం మొత్తం మీద దాదాపు 25 కోట్ల మంది విద్యార్థులను టీమ్స్ గా విభజించి పలు టోర్నమెంట్స్ నిర్వహిస్తూ వారిలోని ప్రతిభని జాతీయ స్థాయిలో అందరికి తెలిసేలా చేస్తుంది…
ఇప్పుడు ఈ బోర్డులో దర్శకధీరుడు రాజమౌళి చైర్మన్ గా బాధ్యత స్వీకరించి మరికొంతమంది క్రికెటర్స్ ని ఎంకరేజ్ చేసి దేశానికీ పరిచయం చేయనున్నాడు. ఇక ఇప్పటికే ఈ బోర్డులో రాజమౌళి కుమారుడు కార్తికేయ జాయింట్ సెక్రెటరీగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు