Tuesday, November 26, 2024

శ్రీ‌శైలం డ్యామ్‌కు కొన‌సాగుతున్న వ‌ర‌ద.. త‌గ్గిన ఇన్‌ఫ్లోలు!

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొన‌సాగుతోంది. అయితే ఇంత‌కుముందున్న ఇన్‌ఫ్లో ఇప్పుడు లేదు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2.26 లక్షల క్యూసెక్కుల వరద వ‌స్తోంది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువ‌న ఉన్న సాగ‌ర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 2.20 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది.

ఇక‌.. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇప్పుడు 884.40 అడుగుల వద్ద నీరు ఉంది. ప్రాజెక్టులో 215.80 టీఎంసీలకు గాను 212.43 టీఎంసీలు నీటి నిల్వలున్నాయి. కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల్లో జ‌ల‌విద్యుత్ కొన‌సాగుతోంది. కాగా, నాగార్జున సాగర్‌కు స్పిల్‌వే ద్వారా 1.39 లక్షల క్యూసెక్కులు, జలవిద్యుత్‌ ద్వారా 62,723 క్యూసెక్కుల ఓట్‌ఫ్లో ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement