ఆంధ్రప్రభ స్మార్ట్ కర్నూల్ బ్యూరో – శ్రీశైలం జలాశయం నిండుకుంటుంది. పూర్తిస్థాయి జలాశయ నీటిమట్టం కు మరో మూడు అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుతం జలాశయానికి 4.42 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతితో ఈ క్షణమైనా శ్రీశైలం డ్యాం నిండుకోనుంది. అయితే ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంను గుర్తించిన అధికారులు జలాశయంలో కనిష్ట స్థాయిలో నీటి నిల్వలు చేసుకుని వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయం కు 4.42 లక్షల క్యూసెక్కులు నీటి ప్రవాహం వచ్చి చేరుతుండగా, ఇక డ్యామ్ కి చెందిన 5 గేట్లుని 10 అడుగుల మీద ఎత్తి దాదాపు 80784 క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్ కు వదులుతున్నారు. ఇదే సమయంలో జలాశయం చెందిన కుడి ఎడమ ప్రాజెక్టులలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఏపీ పవర్ హౌసులో 26142 క్యూసెక్కుల నీటిని వినియోగించి 15.201 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుండగా, ఇక ఎడమ విద్యుత్ కేంద్రంలో 35315 క్యూసెక్కుల నీటిని వినియోగించి 18.437 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక తెలంగాణ పరిధిలోని కల్వకుర్తికి 1600 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 37,185 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. మొత్తంగా శ్రీశైల జలాశయం నుంచి లక్ష 22 వేల 53 క్యూసెక్కుల నీరు జలాశయం నుంచి విడుదలవుతుంది.
పర్యాటకుల సందడి
శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల చేయడంతో, మంగళవారం శ్రీశైలం కి పెద్ద ఎత్తున పర్యాటకులు పోటెత్తారు. శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణ జలాల పరవళ్లను తిలకించేందుకు ఆసక్తి చూపారు. సెల్ఫీలు , ఫోటోలు తీసుకుని పరవశంలో మునిగిపోయారు.. దీంతో ముందు జాగ్రత్తగా జలాశయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
శ్రీశైల డ్యాంలో నీటి వివరాలు
1.శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 882. 50 అడుగులు.
- జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వలు 215 .807టీఎంసీలు, ప్రస్తుతం 201.5822 టీఎంసీలు
- జలాశయం కు ఇన్ఫ్లో 4.42.441,. అవుట్ ఫ్లో 1.22,053 క్యూసెక్కులు.