Tuesday, November 26, 2024

TS | సంతరించుకున్న జల కల… నిండుకుండలను తలపిస్తున్న జలాశయాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నీరు లేక ఎండిపోయి నదీగర్భం బీళ్లు బారిన శ్రీరాంసాగర్‌ విస్తరంగా కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించుకుంది. భారీ వరద ప్రవాహం ప్రాజెక్టులో చేరుతుండటంతో 21 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం శ్రీరాంసాగర్‌ ఇన్‌ ఫ్లో 64,034 ఉండగా ఔట్‌ ఫ్లో 54, 920 చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 90.313 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 90.31 వరకు నీరు చేరుకుంది. నీటి నిల్వలు మరింత పెరగకుండా 21 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తూ చెరువులు, కుంటలు, పంటకాలువలకు సరఫరా చేస్తున్నప్పటికీ గోదావరి తీరంనుంచి భారీగా వరదనీరు సముద్రం వైపు ప్రయాణిస్తోంది.

మరి కొద్ది రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రజాజీవనానికి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే సింగూరు ప్రాజెక్టు సామర్ధ్యం 29.917 ఉండగా ప్రస్తుతం 28,11 టీఎంసీలకు చేరుకుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిసామర్ధ్యం 17.800 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 17.08 టీఎంసీలు చేరుకుంది. ఇన్‌ ఫ్లో 35 వేల క్యూసెక్కులుండగా ఔట్‌ ఫ్లో సమానంగా ఉంది.

- Advertisement -

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టు నిండి పైనుంచి ప్రవహించడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి భారీగా నీటిని వదిలారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో తిరిగి ప్రాజెక్టు లోకి భారీ వరద చేరుకుంటుంది. ప్రాజెక్టు సామర్ధ్యం 7.600లు కాగా ప్రస్తుతం 6.66 టీఎంసీలు ఉంది. ఇన్‌ ఫ్లో 3,18,810 క్యూసెక్కులుండగా ఔట్‌ ప్లో కూడా 3,18,810 క్యూసెక్కులుంది. మేడిగడ్డ బ్యారెజిలోకి 16.170 టీఎంసీలు ఉండగా ఇన్‌ ఫ్లో 2,24,320 క్యూసెక్కులుండగా ఔట్‌ ఫ్లో కూడా 2,24,320 క్యూసెక్కులుంది.

సమ్మక్క సాగర్‌ జలాశయం పూర్తి స్థాయిలో నిండగా ఇన్‌ ఫ్లో 2,24,890 ఉండగా ఔట్‌ ఫ్లో సమానంగా ఉంది. దుమ్ముగూడెం ప్రాజెక్టు ఇన్‌ ఫ్లో 2,00,675 ఉండగా ఔట్‌ ఫ్లో 2,00,675 ఉంది. భద్రాచలం ప్రాజెక్టులో 21,10 ఫీట్ల స్థాయికి నీరు చేరుకోగా ఇన్‌ ఫ్లో 2,02,702 ఉండగా ఔట్‌ ఫ్లో కూడా 2,02,702 ఉంది. ఈ ప్రోజెక్టులోకి నీరు ఎంతచేరుతుందో అంతనీరు బయటకు వదులుతూ ముంపు ఏర్పడకుండా చర్యలు చేప్టటారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement