Saturday, November 23, 2024

Shiridi | షిరిడీలో ఘనంగా శ్రీరామ నవమి ఉత్సవాలు

శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా.. మొదటి రోజున షిరిడీలో బాబా చిత్రపటాన్ని ఊరేగించారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయిబాబా ఆలయంలో కలెక్టర్, తాత్కాలిక కమిటీ సభ్యులు సిద్ధరామ సాలిమఠ్ ఆధ్వర్యంలో శ్రీవారి పద్యపూజలు నిర్వహించారు. సాయిసచ్చరిత్ అనే పవిత్ర గ్రంథ పారాయణాన్ని ప్రారంభించిన కలెక్టర్ సాలిమఠ్.. అందులోని మొదటి అధ్యాయాన్ని చదివి వినిపించారు.

ఇక ఈ పూజా కార్య‌క్రామంలో.. ముఖ్య కార్యనిర్వహణాధికారి తుకారాం.. అడ్మినిస్ట్రేటివ్ అధికారులు విఠల్ రావు బర్గే పాల్గొన్నారు. ఈసారి ఇన్‌స్టిట్యూట్ చీఫ్ అకౌంటెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంగళ వ-హడే, ఆలయ అధిపతి రమేష్ చౌదరి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తుషార్ షెల్కే, ఆలయ పూజారి, షిర్డీ గ్రామస్తులు, సాయి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామనవమి సందర్భంగా ఆలయం, ప్రాంగణంలో అందమైన పూల అలంకరణ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement