అయోధ్య రామాలయం గర్భగుడిలోకి రాముని విగ్రహం చేరింది. వేద మంత్రోచ్ఛారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య గురువారం తెల్లవారుజామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకవచ్చారు. ట్రక్కులో విగ్రహం రాగానే జై శ్రీరామ్ నినాదంతో ప్రాంగణం దద్దరిల్లింది.
క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చేర్చారు. కాగా, వెండితో చేసిన ఒక రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో రం ఊరేగించారు. పూజారి నెత్తిపై కలశాన్ని ఉంచుకుని ముందు నడుస్తుండగా, పూలతో అలంకరించిన పల్లకిలో ఈ వెండి విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు. జనవరి 22న ‘ప్రాణప్రతిష్ఠ’ వేడుకకు ముందు వరకు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఏడు రోజుల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.