మహిళల ఆసియా కప్ ఫైనల్స్‌లో ఆతిథ్య జట్టు శ్రీలంక విజేతగా నిలిచింది. దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌ను ఓడించి తమ తొలి మహిళల ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 165 పరుగులు సాధించింది.
కాగా, ఈ చేధనలో శ్రీలంకకు శుభారంభం దక్కలేదు.. రెండో ఓవర్లోనే ఓపెనర్ విష్మి గుణరత్నే రనౌట్‌గా పెవిటియన్ చేరింది. ఆ తరువాత చమరి అతపట్టు (61), హర్షిత సమరవిక్రమ (69 నాటౌట్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. 12వ ఓవర్లో చమరి ఔటయ్యింది.
కానీ ఆ తర్వాత వచ్చిన కవిషా దిల్హరి (30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. హర్షిత సమరవిక్రమ… కవిషా దిల్హరి తో భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. దీంతో భారత్ నిర్దేశించిన 166 పరుగుల టార్గెట్‌ను 19వ ఓవర్‌లోనే చేదించి శ్రీలంక మహిళల జట్టు ఆసియా కప్ 2024 టైటిల్‌ను కైవసం చేసుకుంది.