భారతీయ నేవీ14 మంది శ్రీలంక జాలర్లను అరెస్టు చేసింది. రాణి దుర్గావతి పెట్రోలింగ్ నౌకకు వాళ్లు పట్టుబడ్డారు. భారతీయ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి సీ కుకుంబర్ చేపల్ని వేటాడుతున్నట్లు గుర్తించారు.
- Advertisement -
సీ కుకుంబర్ చేపల కోసం వాళ్లు మే 14వ తేదీన ఐఎంబీఎల్ దాటి వేటకు వచ్చినట్లు తేలింది. భారతీయ జలాల్లోని 7 నాటికల్ మైళ్ల లోపల శ్రీలంక ఫిషింగ్ బోట్లను పట్టుకున్నట్లు పెట్రోలింగ్ నౌక ఐసీజీఎస్ రాణి దుర్గావతి నావికులు తెలిపారు. 1981 మారిటైం జోన్ ఆఫ్ ఇండియా యాక్టు ప్రకారం వాళ్లను పట్టుకున్నారు. అంతరించే జాతికి చెందిన సుమారు 200 కేజీల చేపల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.