Tuesday, November 19, 2024

క్రికెట్​కు గుడ్​బై చెప్పిన శ్రీలంక క్రికెటర్​.. సోషల్​ మీడియాలో ఎమోషనల్​ పోస్టు!

శ్రీలంక క్రికెట‌ర్‌ లాహిరు తిరిమన్నె సోషల్ మీడియాలో షాకింగ్ న్యూస్ వెల్ల‌డించారు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఈ సీనియర్ ప్లేయర్.. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెబుతూ తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. గతేడాది మార్చిలో శ్రీలంక తరుఫున చివరి వన్డే ఆడారు తిరిమ‌న్నె.. 12 ఏళ్లపాటు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించిన తిరిమన్నె.. త‌న తన రిటైర్మెంట్‌పై ఎమోష‌నల్ అవుతూ ఒక ట్వీట్ కూడా పెట్టారు.

‘‘ఒక ఆటగాడిగా నేను నా వంతు కృషి చేశా. జట్టును గెలిపించేందుకు నా వంతు ప్రయత్నం చేశాను. నా మాతృభూమికి నిజాయితీగా నా బాధ్యతను నిర్వర్తించాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం. కానీ నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని నేను ఇక్కడ ప్రస్తావించలేను” అని తిరిమన్నె సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

- Advertisement -

దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చినందుకు శ్రీలకం క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపారు తిరిమన్నె. శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులు, కోచింగ్ సిబ్బంది, సహచరులు, ఫిజియోథెరపిస్ట్‌లు, శిక్షకులు, వ్యాఖ్యతలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా అండగా అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement