ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఇవ్వాల (గురువారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లండ్- శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టును కనీసం 200 పరుగులు కూడా చేయనివ్వకుండా ఆలౌట్ చేసింది శ్రీలంక టీమ్. దీంతో ఇంగ్లండ్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకే పరిమితం అయింది. చేజింగ్ లో 26 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో మ్యాచ్ ను ముగించేసింది శ్రీలంక జట్టు.
లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక 77 పరుగులు (నాటౌట్), సదీరా సమర విక్రమ 65 పరుగులు (నాటౌట్) సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే కి మాత్రమే రెండు వికెట్లు దక్కాయి. మిగతా బౌలర్లు నిరాశపర్చారు. శ్రీలంకకు ఇది రెండో విజయం కాగా.. ఇంగ్లండ్ జట్టుకు నాలుగో ఓటమి. ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు మరోసారి నిరాశపర్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగళూరు లాంటి బ్యాటింగ్ పిచ్ పై కూడా ఇంత తక్కువ స్కోరు చేయడం ఇంగ్లండ్ కే సాధ్యం అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ (43), బెయిర్ స్టో (30), డేవిడ్ మలాన్ (28) రాణించారు. మిగతా బ్యాటర్లు నిరాశపర్చారు. లంక బౌలర్లలో లహిరు కుమార మూడు వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. మాథ్యూస్, కసున్ రజిత చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు