Saturday, November 23, 2024

ఆసియా క్రికెట్‌ కప్‌కు శ్రీలంక ఆతిథ్యం!

పాకిస్తాన్‌లో 2023 ఆసియా కప్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో, ఈవెంట్‌కు ఆతిథ్య దేశంగా శ్రీలంకకు అవకాశం దక్కనుంది. పాక్‌లో ఆడేందుకు ఇండియా నిరాకరించడం, పీసీబీ సూచించిన హైబ్రిడ్‌ విధానాన్ని బీసీసీఐ వ్యతిరేకించిన నేపథ్యంలో, ఆసియాకప్‌ ఆతిథ్యం ప్రశ్నార్థకంగా మారింది.

ఈ నేపథ్యంలో ఈవెంట్‌ నిర్వహణకు దుబాయ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ప్రత్యామ్నాయ వేదికలుగా తెరపైకి వచ్చాయి. అయితే, దుబాయ్‌లో వేసవి వాతావరణం ప్రతికూలంగా ఉంటున్నందున, శ్రీలంకకే ఆతిథ్య అవకాశం దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఆసియా కప్‌ వేదికపై అధికారికంగా ఈ నెలాఖరులోగా బయటకు వచ్చే అవకాశం ఉన్నందున, ఐసీసీ ఎలాంటి వైఖరిని తీసుకుంటుందో వేచిచూడాలి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement