పాకిస్తాన్తో గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు పట్టు సాధించింది. నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి పాక్ ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసింది. ఇంకా 419 పరుగులు వెనకబడింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే… 176/5 ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన శ్రీలంక మరో 184 పరుగులు జోడించింది. 360 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా (109) సెంచరీతో కదంతొక్కాడు. రమేష్ మెండిస్ 45 పరుగులతో అజేయంగా నిలచి జట్టు భారీ స్కోరు చేయడానికి తోడ్పడ్డాడు.
దీంతో శ్రీలంక 91.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 360 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పాక్ బౌలర్లలో నజీమ్ షాహ్, మొహమ్మద్ నవాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (16) వికెట్ను ఆరంభంలోనే జారవిడుచుకుంది. మరో ఓపెనర్ ఇమామ్-ఉల్- హఖ్ 46, కెప్టెన్ బాబర్ ఆజమ్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక పాక్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.